Fri Dec 20 2024 14:05:16 GMT+0000 (Coordinated Universal Time)
15మందికి ఉరిశిక్ష.. సంచలన తీర్పు
జార్ఖండ్ లో న్యాయస్థానం సంచలన తీర్పు చెప్పింది. పది హేను మందికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది
జార్ఖండ్ లో న్యాయస్థానం సంచలన తీర్పు చెప్పింది. పది హేను మందికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఒక ఖైదీ హత్య కేసులో జార్ఖండ్ లోని న్యాయస్థానం ఈ తీర్పు చెప్పింది. మరో ఏడుగురికి పదేళ్ల జైలు శిక్ష విధించింది. జార్ఖండ్ లోని ఘాఘీడీహ్ సెంట్రల్ జైలులో 2019లో ఖైదీల మధ్య జరిగిన ఘర్షణలో మనోజ్ సింగ్ అనే ఖైదీ ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను న్యాయస్థానం ఎదుట ప్రవేశపెట్టారు.
ఖైదీ హత్య కేసులో...
ఈస్ట్ సింగ్భుమ్ లోని అదనపు జిల్లా కోర్టులో ఈ కేసుపై విచారణ జరగింది. ఇరువురి వాదనలను విన్న జస్టిస్ రాజేంద్ర కుమార్ సిన్హా 15 మందికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. అయితే ఉరిశిక్ష పడిన వారిలో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకుని కోర్టు ఎదుట హాజరుపర్చాలని న్యాయమూర్తి ఆదేశించారు. తప్పించుకున్న ఇద్దరు నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Next Story