Thu Dec 19 2024 19:01:07 GMT+0000 (Coordinated Universal Time)
Judgement : అత్యాచారం కేసులో 20 ఏళ్లు జైలుశిక్ష
బంజారాహిల్స్ డీఏవీ స్కూల్ లో విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన డ్రైవర్ కు కోర్టు ఇరవై ఏళ్ల జైలు శిక్ష విధించింది.
బంజారాహిల్స్ డీఏవీ స్కూల్ లో విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన డ్రైవర్ కు న్యాయస్థానం ఇరవై ఏళ్ల జైలు శిక్ష విధించింది. నాంపల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఈ మేరకు తీర్పు చెప్పింది. గత ఏడాది అక్టోబరు 17వ తేదీన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. డీఏవీ స్కూలులో ప్రిన్సిపల్ డ్రైవర్ విద్యార్థులపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై తల్లిదండ్రులు కూడా పెద్దయెత్తున ఆందోళనకు దిగారు.
విద్యార్థినిపై లైంగిక దాడి...
దీంతో డ్రైవర్ రంజిత్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన డ్రైవర్ కు ఇరవై ఏళ్ల జైలు శిక్ష పడటంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పోలీసు విచారణలో డ్రైవర్ రంజిత్ కుమార్ లైంగిక దాడికి పాల్పడినట్లు తేలడంతో కోర్టు ఈ మేరకు తీర్పు నిచ్చింది. సంఘటన జరిగిన వెంటనే ఆ పాఠశాలను తెలంగాణ విద్యాశాఖ మూసివేసింది. విద్యార్థులను ఇతర పాఠశాలలకు వెళ్లే ఏర్పాట్లు చేసింది.
Next Story