Sat Nov 30 2024 03:36:17 GMT+0000 (Coordinated Universal Time)
పార్క్ లో యువతి హత్య.. చంపింది అతడే
దక్షిణ ఢిల్లీలోని మాళవియా నగర్‌లోని ఓ పార్కులో కళాశాల విద్యార్థినిపై ఇనుప రాడ్‌తో దాడి జరిగింది
దక్షిణ ఢిల్లీలోని మాళవియా నగర్‌లోని ఓ పార్కులో కళాశాల విద్యార్థినిపై ఇనుప రాడ్‌తో దాడి జరిగింది. ఈ ఘటనలో ఆమె మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ మహిళ తన బంధువును కలిసేందుకు పార్కుకు వచ్చింది. ఆమె హత్య కేసులో అతడిని అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణ ప్రకారం హత్యకు గురైన అమ్మాయి నర్గీస్, నిందితుడు ఇర్ఫాన్ మధ్య సంబంధం ఉంది. నర్గీస్ కుటుంబం వారి వివాహాన్ని ఆమోదించడానికి నిరాకరించింది, దీంతో ఇర్ఫాన్ ఆమెను హత్య చేశాడు.
ఇర్ఫాన్ (28) ఫుడ్ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. అతడు నర్గీస్ కు కజిన్ అవుతాడు. ఇర్ఫాన్ ఆర్థిక స్థితిగతుల కారణంగా యువతి కుటుంబసభ్యులు పెళ్లికి నిరాకరించారు. దీంతో నర్గీస్ అతడ్ని దూరం పెట్టడం మొదలుపెట్టింది. మాల్వియా నగర్లో కోచింగ్ క్లాసెస్‌కి పార్క్ నుండి ఆమె వెళ్తుందనే విషయం ఇర్ఫాన్ కు తెలుసు. దీంతో అక్కడే ఆమెను హతమార్చాలని పథకం రచించాడు. పార్క్‌కి చేరుకున్న అతడు, నర్గిస్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. అందుకు ఆమె నిరాకరించడంతో తీవ్ర కోపాద్రిక్తుడైన ఇర్ఫాన్ ఇనుప రాడ్‌తో ఆమెపై దాడి చేశాడు. ఆమె చనిపోయిందనుకున్న విషయం నిర్ధారించుకొని, అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇనుప రాడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టి, కొన్ని గంటల్లోనే పట్టుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడు రోజుల క్రితమే నర్గీస్‌ను హత్య చేయాలని ఇర్ఫాన్ ప్లాన్ చేశాడు. నర్గీస్ షెడ్యూల్ గురించి అతనికి బాగా తెలుసన్నారు అధికారులు. ఆమె స్టెనోగ్రఫీ శిక్షణ కోసం మాల్వియా నగర్ పార్క్ నుండీ వెళుతుందని అతనికి తెలుసని పోలీసులు చెప్పారు. హత్య జరిగిన రోజు కూడా అతడు రిలేషన్ షిప్ ను పునరుద్ధరించే ప్రయత్నంలో ఆమెను సంప్రదించాడు. అయితే.. అందుకు ఆమె నిరాకరించడంతో ఇనుప రాడ్‌తో ఆమెపై దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
Next Story