Mon Dec 23 2024 03:25:03 GMT+0000 (Coordinated Universal Time)
బాలిక ప్రియుడితో సన్నిహితంగా ఉన్న ఫొటోలతో
కరీంనగర్ పట్టణంలోని ఓ కాలనీకి చెందిన బాలిక పదో తరగతి చదువుతోంది. అదే కాలనీలో ఉండే ఇంటర్ చదివే బాలుడితో
కరీంనగర్ పట్టణం లో దారుణం చోటు చేసుకుంది. ఓ బాలిక యువకుడితో ప్రేమలో పడింది. ఆమె అతడితో సన్నిహితంగా ఉంది. ఆ సమయంలో రహస్యంగా ఫొటోలు, వీడియోలు తీశారు ఆ యువకుడి స్నేహితులు. ఆ వీడియోలు చూపి ఆమెను బెదిరించడం మొదలుపెట్టారు. పలు సందర్భాల్లో అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన కరీంనగర్ పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కరీంనగర్ పట్టణంలోని ఓ కాలనీకి చెందిన బాలిక పదో తరగతి చదువుతోంది. అదే కాలనీలో ఉండే ఇంటర్ చదివే బాలుడితో ఆమె ప్రేమలో పడింది. ఏడాది కిందట వారిద్దరూ సన్నిహితంగా ఉన్న వీడియో, ఫొటోలను బాలుడి ఇద్దరు స్నేహితులు రహస్యంగా చిత్రీకరించారు. నీ తల్లిదండ్రులకు చూపెడతామని ఆ బాలికను బెదిరించడం మొదలుపెట్టారు. ఆ బాలికను లొంగదీసుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. అతడి స్నేహితులైన మరో ముగ్గురు బాలికను లొంగదీసుకునేందుకు ప్రయత్నించారు. మూడు రోజుల కిందట విషయం షీటీమ్ దృష్టికి వెళ్ళింది. అఘాయిత్యానికి పాల్పడిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. విషయాన్ని రహస్యంగా ఉంచారు. సోమవారం బాలిక తల్లిదండ్రులతో కలిసి నగరంలోని వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ఆమె ప్రేమికుడితో కలిపి ఆరుగురిపై పోక్సో, అత్యాచారం, బెదిరింపుల కేసు నమోదు చేశారు. కేసు నమోదైన ఆరుగురిలో అయిదుగురు ఇంటర్ చదువుతున్నారని, మరో వ్యక్తి మేజర్ అని, పోలీసులు తెలిపారు.
Next Story