Mon Dec 23 2024 05:45:45 GMT+0000 (Coordinated Universal Time)
Tirupati: తిరుపతిలోని ఆ కుటుంబంలో ఊహించని దారుణం
తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సమీపంలోని
తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సమీపంలోని మునిరెడ్డి నగర్లో బుధవారం రాత్రి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన కుటుంబంలోని ముగ్గురిని కత్తులతో పొడిచి చంపేశాడు. మృతులను గుడిమెట్ల సునీత, ఆమె ఇద్దరు కుమార్తెలు దేవిశ్రీ, నీరజ గా గుర్తించారు. కుటుంబ కలహాల కారణంగానే ఈ దారుణ హత్యలు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
అన్న పిల్లలు దేవిశ్రీ, నీరజ లతో పాటు అన్న భార్య, సునీత ను హత్య చేసి గుడిమెట్ల మోహన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. మోహన్ తన భార్యతో విడిపోయి బతుకుతున్నాడు. ఈ జంటను కలిపే ప్రయత్నంలో.. దాస్-సునీత మధ్యవర్తిత్వం వహించారు. ఈ ప్రయత్నాలు వీరి మధ్య గొడవలను పెంచాయి. దీంతో విసుగు చెందిన మోహన్ ఈ దారుణమైన ఘటనకు పాల్పడ్డాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్మార్టం కోసం పంపారు. ఘటనా స్థలానికి చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రైవేటు సీసీ కెమెరాలను, పోలీస్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానమైన సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
Next Story