Mon Dec 23 2024 05:50:24 GMT+0000 (Coordinated Universal Time)
Bandla Ganesh : బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు నమోదు
సినీ నిర్మాత బండ్ల గణేష్ మీద క్రిమినల్ కేసు నమోదయింది.
సినీ నిర్మాత బండ్ల గణేష్ మీద క్రిమినల్ కేసు నమోదయింది. ఫిలిం నగర్ లో హీరా గ్రూపు సీఈఓ నౌహీరా షేక్ కి చెందిన 75 కోట్ల విలువైన ఇల్లు కబ్జా చేశారని బండ్ల గణేష్ పై ఆరోపణలున్నాయి. ఇంటినీ ఖాళీ చేయమని అడిగేందుకు వెళ్ళిన నౌహేరా షేక్ ను నిర్బంధించి బెదిరింపులకు బండ్ల గణేష్ పాల్పడ్డారన్ని పోలీలసుకు ఫిర్యాదు అందింది. ఫిబ్రవరి 15 న ఘటన జరిగిందని, ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోగా ఫిలిం నగర్ పోలీసులు నౌహెరా షేక్ మీద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఇంటిని కబ్జా చేశారంటూ...
ఈ వ్యవహారంపై తాజాగా డీజీపీకి చేసిన నౌహీరా షేక్ ఫిర్యాదు చేయడంతో పాటు, ఫోక్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. తాజాగా ఉన్నతాధికారుల ఆదేశంతో బండ్ల గణేష్ మీద ఐపిసి 341, 506 సెక్షన్ల కింద ఫిలిం నగర్ పోలీసులు. కేసు నమోదు చేశారు.
Next Story