Wed Dec 25 2024 16:55:06 GMT+0000 (Coordinated Universal Time)
నేటితో ముగియనున్న టోనీ కస్టడీ
హైదరాబాద్ లో పెద్దయెత్తున డ్రగ్స్ ను సరఫరా చేసిన డ్రగ్ పెడ్లర్ టోనీ కస్టడీ నేటితో ముగియనుంది
హైదరాబాద్ లో పెద్దయెత్తున డ్రగ్స్ ను సరఫరా చేసిన డ్రగ్ పెడ్లర్ టోనీ కస్టడీ నేటితో ముగియనుంది. టోనీని విచారించేందుకు న్యాయస్థానం ఐదు రోజులు గడువు ఇచ్చింది. ఈ గడువు నేటీతో ముగియనుంది. టోనీని ఇప్పటి వరకూ చేసిన విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయని తెలిసింది. హైదరాబాద్ కు చెందిన పది మంది వ్యాపారుల పేర్లు కూడా టోనీ చెప్పినట్లు తెలిసింది.
మళ్లీ విచారణకు....
ప్రత్యేకంగా హైదరాబాద్ లో నెట్ వర్క్ ను ఏర్పాటు చేసుకుని డ్రగ్స్ ను సరఫరా చేసినట్లు టోనీ విచారణలో అంగీకరించారు. పది గ్రాముల నుంచి యాభై గ్రాముల వరకూ చేరవేసినట్లు తెలిపారు. టోనీకి హైదరాబాద్ లో సహకరించిన వారు ఎవరు? డ్రగ్స్ అందుకున్న వారెవరూ అన్న దానిపై నేడు కూడా పోలీసులు విచారించనున్నారు. మరికొద్ది రోజులు టోనీ కస్టడీకి అనుమతించాని పోలీసులు కోర్టును కోరే అవకాశముంది.
- Tags
- drug peddler
- tony
Next Story