Mon Dec 23 2024 12:58:36 GMT+0000 (Coordinated Universal Time)
ఎయిర్ పోర్టులో విదేశీ కరెన్సీ పట్టివేత
శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా విదేశీ కరెన్సీని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా విదేశీ కరెన్సీని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి షార్జా వెళ్లేందుకు వచ్చిన మహ్మద్ నజీర్ వద్ద నుంచి ఈ విదేశీ కరెన్సీని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నజీర్ ను అదుపులోకి తీసుకుని సీఐఎస్ఎఫ్ పోలీసులు విచారణ చేస్తున్నారు.
షార్జా వెళ్లేందుకు....
మహ్మద్ నజీర్ షార్జా వెళ్లేందుకు ఎయిర్ అరేబియా విమానానికి టిక్కెట్ బుక్ చేసుకున్నారు. బ్యాగేజీలో సౌదీ రియాలు బయటపడ్డాయి. వీటి విలువ 34.49 లక్షలు ఉంటుందని చెబుతున్నారు. నజీర్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు.
Next Story