Mon Dec 23 2024 12:20:54 GMT+0000 (Coordinated Universal Time)
ఏడుకోట్ల విలువైన బంగారం స్వాధీనం
హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు
హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్ ఇంటలిజెన్స్ తో పాటు కస్టమ్స్ అధికారులు సమన్వయంతో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుడాన్ నుంచి షార్జా మీదుగా వచ్చిన 23 మంది ప్రయాణికులను తనిఖీ చేయగా ఈ బంగారం బయటపడింది. వీరంతా సూడాన్ దేశానికి చెందిన వారిగా గుర్తించారు.
సూడాన్ దేశస్థుల నుంచి...
ప్రయాణికుల లగేజీతో పాటు వ్యక్తులను కూడా తనిఖీ చేయగా వారి బూట్లలో ఏర్పడిన చిన్న చిన్న రంధ్రాలు ఉ:డటం, కాళ్ల కింద ఉన్న బంగారాన్ని, వారి బట్టల మడతల్లో దాచిన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 23 మంది ప్రయాణికులు వివిధ ప్రదేశాల్లో బంగారాన్ని దాచి తరలిస్తున్నట్లు గుర్తించారు. కస్టమ్స్ అధికారులు మొత్తం 14.9063 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 14,415 కిలోలు 22 క్యారెట్ల బంగారం కాగా, 0.491 కిలోల 22 క్యారెట్ల బంగారంగా చెబుతున్నారు. దీని విలువ 7.89 కోట్ల విలువైనదని అధికారులు చెప్పారు. 23 మందిలో నలుగురి ప్రయాణికులను అరెస్ట్ చేశారు.
Next Story