Mon Dec 23 2024 14:13:48 GMT+0000 (Coordinated Universal Time)
భారీగా బంగారం స్వాధీనం
ముంబై ఎయిర్ పోర్టులో భారీగా బంగారం కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.
ముంబై ఎయిర్ పోర్టులో భారీగా బంగారం కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. షార్జా నుంచి వచ్చిన ప్రయాణికుల వద్ద నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఐదుగురు ప్రయాణికుల నుంచి నాలుగు కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
పేస్టుగా మార్చి...
బంగారాన్ని పేస్టు గా మార్చి తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ బంగారాన్ని తరలిస్తున్న ఐదుగురు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బంగారాన్ని సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ముంబయి ఎయిర్ పోర్టు నుంచి తరచూ బంగారాన్ని తరలిస్తుండటం, వాటిని కస్టమ్స్ అధికారులు పట్టుకోవడం మామూలయిపోయింది.
Next Story