Mon Dec 23 2024 18:29:06 GMT+0000 (Coordinated Universal Time)
ట్రాప్ చేసి డబ్బులు గుంజి...?
యువకులను ట్రాప్ చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్న యువతిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
యువకులను ట్రాప్ చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్న యువతిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా ద్వారా ట్రాప్ చేస్తూ డబ్బులు లాగేందుకు ప్రయత్నిస్తున్న యువతిని పోలీసులు పట్టుకున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన తనుశ్రీ గత కొంతకాలంగా ఇన్స్టాగ్రామ్, ఫైస్బుక్ లో తన అందమైన ఫోటోలు, వీడియోలను పెట్టి ట్రాప్ చేస్తుంది. ప్రేమ పేరుతో వలపన్ని పెళ్లి చేసుకుందామని నమ్మిస్తుంది.
యువతి, ప్రియుడు అరెస్ట్...
హైదరాబాద్ లోని ఒక యువకుడి నుంచి తనుశ్రీ 31 లక్షల రూపాయలను వసూలుచేసింది. ఈ ట్రాప్ వెనక తనుశ్రీ ప్రియుడు శ్రీకాంత్ కూడా ఉన్నాడు. దీంతో అందిన ఫిర్యాదు మేరకు తనుశ్రీని, ఆమె ప్రియుడు శ్రీకాంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చాలా మంది యువకులను ఇలాగే చీట్ చేశారని చెబుతున్నారు. వీరిపై మరిన్ని ఫిర్యాదులు అందే అవకాశముందని పోలీసులు తెలిపారు.
Next Story