Thu Dec 19 2024 12:47:38 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : సైబర్‌క్రైమ్ స్పెషల్ ఆపరేషన్ - 36 మంది నేరగాళ్ల అరెస్ట్
గుజరాత్ లో హైదరాబాద్ కు చెందిన సైబర్ క్రైమ్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్ ను నిర్వహించారు. క్రిమినల్స్ ను అరెస్ట్ చేశారు
గుజరాత్ లో హైదరాబాద్ కు చెందిన సైబర్ క్రైమ్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్ ను నిర్వహించారు. దేశ వ్యాప్తంగా వందల కేసుల్లో నిందితులుగా ఉన్న క్రిమినల్స్ ను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై దేశ వ్యాప్తంగా 983 కేసులు నమోదయినట్లు తెలలిపారు. ఈ క్రిమినల్స్ ను 36 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఏడుగురు సైబర్ క్రైమ్ పిన్స్ తో పాటు ఒక ఛార్టెడ్ అకౌంటెంట్ కూడా ఉన్నారు.
అనేక నేరాలకు...
దేశ వ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతూ కోట్లాది రూపాయలు కొల్లగొట్టినట్లు ఆరోపణలున్నాయి. వీరిని పట్టుకునేందుకు అనేక రకాలుగా ప్రయత్నించారు. చివరకు గుజరాత్ లో ఉన్నట్లు సమాచారం అందడంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దాడి చేసి మరీ పట్టుకున్నారు. వీరిని విచారిస్తే మరిన్న పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశముంది.
Next Story