Thu Dec 19 2024 16:04:07 GMT+0000 (Coordinated Universal Time)
ప్రియుడి మోజులో పడి.. తండ్రిపై కత్తితో దాడి
ఈ విషయం తెలుసుకున్న తండ్రి కూతుర్ని నిలదీశాడు. క్రమంగా అది గొడవకు దారితీయడంతో ..
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో దారుణ ఘటన వెలుగుచూసింది. ప్రియుడి మోజులోపడి.. ఇంటర్ చదువుతోన్న విద్యార్థిని.. తన తండ్రిపై కత్తితో దాడి చేసింది. వివరాల్లోకి వెళ్తే.. విశాఖలోని అక్కయ్యపాలెం శంకరమఠం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి ఇంటర్ చదువుతున్న కుమార్తె ఉంది. ఆమెకు ఐటీఐ చదువుతోన్న బాలుడితో పరిచయమవ్వగా.. ఆ పరిచయం ప్రేమకు దారితీసింది.
యువకుడి మాయలో పడి.. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన ఆమె.. తండ్రికి తెలియకుండా తన ఇంట్లో ఉన్న రూ.2 లక్షల నగదు, 8 తులాల బంగారు ఆభరణాలను ఇచ్చింది. ఈ విషయం తెలుసుకున్న తండ్రి కూతుర్ని నిలదీశాడు. క్రమంగా అది గొడవకు దారితీయడంతో కిచెన్ లో ఉన్న చాకు తీసుకుని తండ్రి మెడపై పొడిచేందుకు యత్నించింది. అతను పక్కకి తప్పుకోవడంతో అదికాస్తా వీపుకి గుచ్చుకుంది. కూతురు దాడి చేయడంతో.. తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
Next Story