Mon Dec 23 2024 06:48:46 GMT+0000 (Coordinated Universal Time)
అన్నంలో విషం పెట్టి కోడలి హత్య.. మరణ వాంగ్మూలంలో?
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జ్యోతి చనిపోయింది. అంతేకాకుండా అత్తింటి వాళ్లు
ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జ్యోతి అనే వివాహితను అత్తింటి వారు దారుణంగా చంపేశారు. ఆమె తినే కూరలో విషం కలిపి హత్య చేశారు. భర్త, మరిది, అత్త కలిసి ఈ హత్య చేశారని మృతురాలి బంధువులు ఆరోపిస్తూ ఉన్నారు. కంచికచర్లకు చెందిన వ్యక్తితో జ్యోతికి వివాహం జరిగింది. వివాహం అయ్యాక అందరు ఆడవాళ్ల లాగా జ్యోతి అత్తారింట్లో ఉంటోంది. గత కొన్నాళ్లుగా భర్త, అత్త, మరిది కలిసి జ్యోతిని వేధింపులకు గురి చేస్తున్నారు. ఆమెను చంపాలని ప్లాన్ వేశారు. జ్యోతి తినే కూరలో విషం కలిపారు. తీవ్ర అస్వస్థకు గురైన జ్యోతిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జ్యోతి చనిపోయింది. అంతేకాకుండా అత్తింటి వాళ్లు కూరలో విషం కలిపారని జ్యోతి వాంగ్మూలం ఇచ్చింది. పాయిజన్ కారణంగానే జ్యోతి చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త, మరిది, అత్తను అదుపులోకి తీసుకున్నారు. తమ బిడ్డను చంపిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ జ్యోతి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కాలంలో కూడా ఇలాంటి దారుణాలు జరుగుతూ ఉండడం షాకింగ్ గా అనిపిస్తూ ఉన్నాయి.
Next Story