Mon Dec 23 2024 18:29:47 GMT+0000 (Coordinated Universal Time)
కన్నకూతురిపై తండ్రి కర్కశత్వం.. సోదరులతో కలిసి..
కూతురి ప్రేమ విషయం తెలుసుకున్న తండ్రి ఇంద్రదేవ్.. వెంటనే ఆమెకు పెళ్లి చేయాలని భావించాడు. అనుకున్నదే తడవు సమీపంలోని..
బీహార్ : నీడలా వెన్నంటే ఉండి.. కూతురికి ఏ కష్టం రాకుండా కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి తండ్రే కన్నకూతురి పాలిట యముడయ్యాడు. తన మాట కాదన్నందుకు సోదరులతో కలిసి కూతురిని కడతేర్చాడు. ఈ ఘటన బీహార్ లోని గోపాల్ గంజ్ లో జరిగింది. తాను చూపించిన యువకుడిని కూతురు పెళ్లి చేసుకునేందుకు ససేమిరా కాదనడంతో ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు. గోపాల్ గంజ్ ప్రాంతంలో ఓ యువతి తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. యువతికి అదే గ్రామానికి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడి, ఆ పరిచయం ప్రేమగా మారింది.
కూతురి ప్రేమ విషయం తెలుసుకున్న తండ్రి ఇంద్రదేవ్.. వెంటనే ఆమెకు పెళ్లి చేయాలని భావించాడు. అనుకున్నదే తడవు సమీపంలోని బిర్చా గ్రామానికి చెందిన ఓ వరుడిని చూశాడు. అతడిని పెళ్లి చేసుకోవాలని కూతురుకి చెప్పగా.. అందుకు ఆమె ఒప్పుకోలేదు. తనమాట కాదన్నందుకు తండ్రి ఆగ్రహానికి గురయ్యాడు. మద్యం తాగి తన సోదరులతో కలిసి ఇంటికి వచ్చిన ఇంద్రదేవ్.. కూతురి కాళ్లు, చేతులు కట్టేసి గొంతుకోసి దారుణంగా హతమార్చాడు. మృతురాలి తల్లి ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అడ్డుకునేందుకు వెళ్లిన తనపై కూడా వారు దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొంది. హత్యానంతరం ఇంద్రదేవ్, అతని సోదరులు పరారయ్యారని, త్వరలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
Next Story