Mon Dec 23 2024 07:45:11 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో దారుణం.. సోదరుడి శవాన్ని ముక్కలు చేసి దర్గా వద్ద పడేసి..
లంగర్ హౌస్ కు చెందిన అశోక్, రాజు, స్వరూప తోబుట్టువులు. అశోక్ గతంలో అనారోగ్యంతో డాన్ బాస్కో ఆస్పత్రిలో..
సోదరుడి శవాన్ని ముక్కలుగా నరికి, వాటిని గోనె సంచిలో ఉంచి ఓ దర్గావద్ద పడేసి వెళ్లారు అన్నాచెల్లెళ్లు. ఈ ఘటన హైదరాబాద్ లోని లంగర్ హౌస్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. తమ సోదరుడు మద్యానికి బానిసై చనిపోయాడని, అంత్యక్రియలకు డబ్బుల్లేక ఇలా చేశామని నిందితులు చెప్పడంతో.. పోలీసులు షాకయ్యారు.
పోలీసులకు నిందితులు తెలిపిన వివరాల ప్రకారం.. లంగర్ హౌస్ కు చెందిన అశోక్, రాజు, స్వరూప తోబుట్టువులు. అశోక్ గతంలో అనారోగ్యంతో డాన్ బాస్కో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. అయినా అతను కోలుకోకపోవడంతో వైద్యులు ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు. ఈ క్రమంలో అశోక్ అనారోగ్యంతో కన్నుమూశాడు. అంత్యక్రియలు చేసేందుకు డబ్బులేక అశోక్ శరీరాన్ని రాజు, స్వరూప ముక్కలు ముక్కలుగా చేశారు. అనంతరం గోనె సంచిలో కుక్కి లంగర్ హౌస్ సమీపంలోని దర్గా వద్ద పడేశారు.
స్థానికులు గమనించి ఏమిటని అడగ్గా.. సమాధానం చెప్పకుండా ఇద్దరూ ఆటోలో అక్కడి నుంచి జారుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా.. అక్కడికి చేరుకున్న పోలీసులు గోనె సంచిలో డెడ్ బాడీ ఉన్నట్లు గుర్తించారు. అశోక్ అంత్యక్రియలకు డబ్బులు లేక మృతదేహాన్ని పారేయటానికి ముక్కలుగా నరికానని అతని సోదరుడు రాజు విచారణలో వెల్లడించాడు. అతనిపై పోలీసులు 302, 201 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అశోక్ నిజంగానే మద్యానికి బానిసై మరణించాడా ? లేక రాజు, స్వరూపలే అతడిని హతమార్చారా ? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం అశోక్ శరీర భాగాలను పోలీసులు ఉస్మానియా మార్చురీకి తరలించారు.
Next Story