Mon Dec 23 2024 14:28:31 GMT+0000 (Coordinated Universal Time)
ఆత్మాహుతి దాడిలో వంద మంది మృతి
పాకిస్థాన్ మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య వందకు చేరుకుంది
పాకిస్థాన్ మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య వందకు చేరుకుంది. పెషావర్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో మసీదులో రెండు రోజుల క్రితం ఆత్మాహుతి దాడి జరిగిన సంగతి తెలిిసిందే. ఈ దాడిలో అనేక మంది ప్రాణాలు కోల్పోగా, వందల సంఖ్యలో గాయపడ్డారు. మృతదేహాలను ఇంకా వెలికి తీస్తున్నారు. రద్దీగా ఉండే మసీదులో బాంబు దాడి జరగడంతో ఎక్కువ మంది మరణించారు.
ఆసుపత్రుల్లో అనేక మంది...
పెషావర్ ఆసుపత్రుల్లో అనేక మంది చికిత్స పొందుతున్నారు. వారిలో అనేక మంది పరిస్థితి విషమంగానే ఉందని చెబుతున్నారు. తెహ్రీక్ - ఇ - తాలిబన్ ఈ దాడికి పాల్పడినట్లు చెబుతున్నారు. ఈ పేలుడులో 200 మందికి పైగానే గాయపడ్డారని, వారిని పెషావర్ లోని లేడీ రీడింగ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ వంద మృతదేహాలను వెలికితీశారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.
Next Story