Tue Dec 24 2024 02:16:03 GMT+0000 (Coordinated Universal Time)
ప్లాట్ ఫామ్ పై డ్రమ్ములో కుళ్లిన మృతదేహం
అక్కడికి వెళ్లిన పోలీసులు.. ఆ డ్రమ్మును పరిశీలించి.. లోపల ఒక మహిళ మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై బెంగళూరు డివిజన్
కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. యశ్వంత్ పూర్ రైల్వే స్టేషన్లోని 1వ నంబర్ ప్లాట్ ఫామ్ వద్ద ఉన్న ఓ ప్లాస్టిక్ డ్రమ్ములో కుళ్లిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహాన్ని గుర్తించారు. బుధవారం (జనవరి 4) రైల్వే సిబ్బంది స్టేషన్ ను శుభ్రం చేస్తున్న క్రమంలో డ్రమ్ము నుండి దుర్వాసన వస్తుండటాన్ని గమనించారు. అందులో ఏముందా అని తీసి చూసేసరికి.. మృతదేహం కనిపించింది. దాంతో హడలిపోయిన సిబ్బంది.. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు.
అక్కడికి వెళ్లిన పోలీసులు.. ఆ డ్రమ్మును పరిశీలించి.. లోపల ఒక మహిళ మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై బెంగళూరు డివిజన్ అదనపు డీఆర్ఎం కుసుమా హరిప్రసాద్ మాట్లాడుతూ.. డ్రమ్ములోపల మృతదేహం.. పైన బట్టలు కప్పిఉన్నాయన్నారు. మహిళ వయసు సుమారు 20 సంవత్సరాలు ఉండొచ్చని భావిస్తున్నామన్నారు. మహిళను ఐదురోజుల క్రితమే హత్యచేసి, పాలిథిన్ కవర్లో చుట్టి.. డ్రమ్ముల కుక్కి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజీ పరిశీలన ద్వారా నిందితుల్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
Next Story