Tue Nov 05 2024 16:29:37 GMT+0000 (Coordinated Universal Time)
అనంతలో జింక మాంసం కలకలం.. వ్యక్తి అరెస్ట్
ఓబులయ్య ఇంటిలో ఫారెస్ట్ అధికారులు సోదాలు నిర్వహించగా.. జింకమాంసం లభ్యమైంది. ఆ మాంసాన్ని స్వాధీనం చేసుకుని,
అనంతపురం : వన్య ప్రాణుల వేట, వధ చట్ట రీత్యా నేరం. ఈ విషయాన్ని ఎన్నిసార్లు చెప్పినా.. వన్యప్రాణులను వధించేవారిలో మార్పు రావడం లేదు. తాజాగా అనంతపురం జిల్లాలో జింకమాంసం లభించడం కలకలం రేపింది. జిల్లాలోని బెళుగుప్ప మండలం విరుపాపల్లిలో ఓబులయ్య అనే వ్యక్తి ఇంట్లో జింక మాంసం లభ్యమైంది. ఓబులయ్య ఇంట్లో సుమారు 2 కేజీల జింకమాంసం వండుతున్నట్లు సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు వెంటనే అక్కడికి చేరుకున్నారు.
ఓబులయ్య ఇంటిలో ఫారెస్ట్ అధికారులు సోదాలు నిర్వహించగా.. జింకమాంసం లభ్యమైంది. ఆ మాంసాన్ని స్వాధీనం చేసుకుని, ఓబులయ్యను అదుపులోకి తీసుకుని కళ్యాణదుర్గం అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. కాగా.. జింకను ఎక్కడ వధించారు ? ఎవరు తీసుకొచ్చారు ? దీనివెనుక ఇంకా ఎంతమంది ఉన్నారన్న దానిపై విచారణ చేస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. పొలాల్లో ఆహారం కోసం జింకలు వచ్చినప్పుడు వాటిని చంపి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Next Story