Mon Dec 23 2024 11:28:04 GMT+0000 (Coordinated Universal Time)
స్నేహితుడని నమ్మి వెళ్తే.. మాట్లాడాలని పక్కకు తీసుకెళ్లి..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ములుగుజిల్లా ఏటూరు నాగారానికి చెందిన విద్యార్థి, వరంగల్ కు చెందిన విద్యార్థిని..
కాలేజీల్లో చదువుకునే యువత.. వీకెండ్ వస్తే సరదాగా ట్రిప్పులకు వెళ్లడం పరిపాటిగా మారింది. అలా హనుమకొండలో ఓ డిగ్రీ కళాశాలలో చదువుతున్న ఏడుగురు స్నేహితులు.. తమ ద్విచక్రవాహనాలపై ములుగు జిల్లా పర్యటనకు వెళ్లారు. ముగ్గురు విద్యార్థినులు, నలుగురు విద్యార్థులు కలిసి వెళ్లిన ఈ ట్రిప్ లో ఒక విద్యార్థినికి అనుకోని పరిణామం ఎదురైంది. స్నేహితురాలిపై కన్నేసిన విద్యార్థి అన్వేశ్ మాట్లాడాలని చెప్పి పక్కకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ములుగుజిల్లా ఏటూరు నాగారానికి చెందిన విద్యార్థి, వరంగల్ కు చెందిన విద్యార్థిని, నల్గొండ జిల్లా మునుగోడుకు చెందిన ఇద్దరు విద్యార్థినులు, మరో ముగ్గురు విద్యార్థులు కలిసి ఆదివారం బైక్ లపై ములుగు జిల్లా వాజేడుకు వెళ్లారు. అక్కడ సరదాగా గడిపిన వీరంతా.. సాయంత్రం తిరుగు పయనమయ్యారు. విశ్రాంతి తీసుకునేందుకు రింగ్ రోడ్డు మీదుగా హనుమకొండ జిల్లా కోమటిపల్లి వద్ద ఆగారు. ఈ క్రమంలో వరంగల్ కు చెందిన విద్యార్థినిని మాట్లాడాలని కొంతదూరం తీసుకెళ్లిన అన్వేష్ అత్యాచారం చేశాడు. అనంతరం అక్కడి నుండి బైక్ పై పరారయ్యాడు. మిగతా స్నేహితులు బాధితురాలి ఆమె ఇంటికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సోమవారం కేయూ పోలీస్ స్టేషన్లో అన్వేష్ పై ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న అతడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
Next Story