Mon Dec 23 2024 02:48:25 GMT+0000 (Coordinated Universal Time)
ప్రేమిస్తున్నానంటూ గర్భవతిని చేశాడు.. అబార్షన్ చేయిస్తుండగా..
ఇప్పుడే పిల్లల్ని కంటే జీవితంలో ఎదగలేమని నమ్మించి అబార్షన్ చేయించేందుకు తీసుకెళ్లాడు. అక్కడ యువతికి వైద్యం..
ప్రేమిస్తున్నానంటూ ఆమె చుట్టూ తిరిగాడు. తనను ప్రేమించాలని ఇద్దరం పెళ్లిచేసుకుని హాయిగా జీవించవచ్చని మాయమాటలు చెప్పి డిగ్రీ యువతిని నమ్మించాడు. గర్భవతిని చేశాడు. పెళ్లిచేసుకుందాం అని ఆ యువతి అడిగేసరికి.. ఇప్పుడే పిల్లల్ని కంటే జీవితంలో ఎదగలేమని నమ్మించి అబార్షన్ చేయించేందుకు తీసుకెళ్లాడు. అక్కడ యువతికి వైద్యం వికటించి మృతి చెందింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు భూక్యానందు అనే యువకుడు డిగ్రీ సెకండియర్ చదువుతున్న యువతిని ప్రేమిస్తున్నానని చెప్పి నమ్మించాడు.
ఆమెను తనకు అవసరమైనపుడు వాడుకున్నాడు. యువతి గర్భం దాల్చడంతో.. అబార్షన్ చేయించేందుకు ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. యువతికి అబార్షన్ చేస్తుండగా వైద్యం వికటించి మృతి చెందింది. విషయం తెలుసుకున్న నందు అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నందు కోసం గాలిస్తున్నారు.
Next Story