Mon Dec 23 2024 19:46:38 GMT+0000 (Coordinated Universal Time)
క్రికెట్ బెట్టింగ్ కి ఓ విద్యార్థి బలి
సతీష్ చేసిన అప్పుల గురించి కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు కొంతవరకు తీర్చారు. అయినప్పటికీ కూడా..
ఐపీఎల్ బెట్టింగ్ కి అలవాటు పడిన ఓ విద్యార్థి బెట్టింగ్లో పెద్ద ఎత్తున డబ్బులు పోగొట్టుకోవడంతో అప్పులు చేసి అవి తీర్చలేక తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న సంఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సతీష్ (21) అనే విద్యార్థి విజయ వాడలోని లయోలా కాలేజీ లో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అయితే సతీష్ గత నెల రోజుల క్రితం హైదరాబాద్ కు వచ్చి అశోక్ నగర్ లోని లక్కీ బాయ్ హాస్టల్లో స్టే చేస్తున్నాడు. బెట్టింగ్లకు అలవాటు పడిన సతీష్ గత ఐపీఎల్లో పెద్ద ఎత్తున బెట్టింగ్ కు పాల్పడ్డాడు. కొంత వరకు లాభం రావడంతో సతీష్ తెగ ఆనందపడి తిరిగి బెట్టింగ్లకు పాల్ప డ్డాడు. దీంతో సతీష్ పెద్ద మొత్తంలో నష్టపోయాడు. ఆ నష్టాలను పూడ్చుకునేందుకు తెలిసిన వారందరి వద్ద అప్పులు చేశాడు.
సతీష్ చేసిన అప్పుల గురించి కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు కొంతవరకు తీర్చారు... అయినప్పటికీ కూడా సతీష్ అప్పులు మొత్తం తీరలేదు. ఈ క్రమంలోనే సతీష్ నెల రోజుల క్రితం విజయవాడ నుండి హైదరాబాద్ కు వచ్చి హాస్టల్లో ఉంటు న్నాడు. ఒకవైపు అప్పుల బాధ మితిమీరిపోవడం.. మరోవైపు మానసిక ఒత్తిడితో సతమతమైన సతీష్ తీవ్ర మనస్తాపంతో హాస్టల్ లోనే ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మ హత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న వెంటనే చిక్కడపల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సతీష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. అనంతరం పోలీసులు సతీష్ మరణించిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. కొడుకు మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్ కారణంగా ఓ విద్యార్థి బలి కావడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Next Story