Fri Dec 20 2024 22:21:43 GMT+0000 (Coordinated Universal Time)
వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి
సోదరి వద్దు వద్దు అంటూ వారిస్తూ కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించింది. కుటుంబ సభ్యులు వెంటనే వెళ్లి చూడగా..
సంగారెడ్డి జిల్లాలో ఓ విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు తన సోదరికి వీడియో కాల్ చేసి ఆత్మ హత్య చేసుకున్న సంఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరువు మండలం రామేశ్వరం బండ వికార్ సెక్షన్ కాలనీలో నివాసం ఉంటున్న శివకుమార్ (20) అనే యువకుడు పటాన్ చెరువు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శివకుమార్ డ్రెస్ కుట్టించుకుని వస్తానని చెప్పి ఇంటి నుండి బయటకు వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత సోదరి సోనీ కి వీడియో కాల్ చేసి నేను ఉరేసుకుని చనిపోతున్నానని చెప్పాడు.
సోదరి వద్దు వద్దు అంటూ వారిస్తూ కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించింది. కుటుంబ సభ్యులు వెంటనే వెళ్లి చూడగా అప్పటికే శివ కుమార్ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడు. అది చూసిన తల్లిదండ్రులు గుండెలు పగిలేలా విలపించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీ సులు ఘటన స్థలానికి చేరుకున్నారు. తన కుమారుడు ఏ కారణంచేత ఆత్మహత్య చేసుకున్నాడో తమకు తెలియదని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. పటాన్చెరువు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Next Story