Sun Dec 22 2024 17:51:15 GMT+0000 (Coordinated Universal Time)
డెహ్రాడూన్ లో ఆరుగురు ప్రాణాలు తీసిన రోడ్డు ప్రమాదం.. పార్టీ చేసుకున్న వీడియో వైరల్
ఈ ప్రమాదం జరగడానికి ముందు చనిపోయిన వ్యక్తులు పార్టీ చేసుకున్న వీడియో
డెహ్రాడూన్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ కారు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఒఎన్‌జిసి చౌక్ వద్ద తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని, వేగంగా వస్తున్న ఇన్నోవా కారు కంటైనర్ ట్రక్కు వెనుక భాగాన్ని బలంగా తాకడంతో కారు నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ ట్విట్టర్ లో వైరల్ అయ్యాయి. సర్కిల్ ఆఫీసర్ నీరజ్ సెమ్వాల్ ప్రకారం ఈ ప్రమాదంలో మొత్తం ఆరుగురు మరణించారు. ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు, అందరూ 25 ఏళ్లలోపు వారే.. అక్కడికక్కడే మరణించారు. 25 ఏళ్ల సిద్ధేష్ అగర్వాల్‌గా గుర్తించిన ఏడవ ప్రయాణీకుడు ప్రాణాలతో బయటపడ్డాడు, కానీఅతడి పరిస్థితి విషమంగా ఉంది. కంటెయినర్ ట్రక్ డ్రైవర్ తప్పు చేయలేదని ప్రాథమిక విచారణలో తేలింది. వేగంగా వచ్చిన కారు ట్రక్కు వెనుక ఎడమ భాగాన్ని ఢీకొట్టింది.
వాహనం నడుపుతున్న వ్యక్తి ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో సాధ్యమయ్యే చర్యలను అన్వేషించడానికి పోలీసులు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. సిద్ధేష్ అగర్వాల్ తలకు బలమైన గాయం కారణంగా అతను సంఘటన గురించి స్టేట్మెంట్ ఇవ్వలేకపోయాడు. మృతుల్లో ఐదుగురు డెహ్రాడూన్‌కు చెందినవారు కాగా, ఒకరు చంబాకు చెందినవారు. ఈ ఘోర ప్రమాదం జరగడానికి ముందు ఈ బృందం అర్థరాత్రి డ్రైవ్‌కు వెళ్లినట్లు సమాచారం. రాజ్పూర్ రోడ్లు, సహరాన్పూర్ చౌక్, బల్లివాలా, బల్లూపూర్ మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు కారు సాధారణ వేగంతో వెళ్ళింది. అయితే ఓఎన్జీసీ కూడలికి చేరుకోగానే కారు ఒక్కసారిగా వేగం పెంచడంతో ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదం జరగడానికి ముందు చనిపోయిన వ్యక్తులు పార్టీ చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ రోడ్డు ప్రమాదంలో మరణించిన ఆరుగురు విద్యార్థుల కుటుంబ సభ్యులు ఇంకా పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, అధికారులు చర్యలు తీసుకోవడానికి దారితీయవచ్చని తెలుస్తోంది. ప్రాథమిక విచారణలో ట్రక్ డ్రైవర్ తప్పేమీ లేదని తేలినందున, పోలీసులు సాధ్యమైన చట్టపరమైన చర్యల గురించి నిపుణుల నుండి సలహాలు కోరుతున్నారు.
Next Story