Mon Dec 23 2024 12:26:20 GMT+0000 (Coordinated Universal Time)
ఘోరం.. బాలికకు మద్యం తాగించి కారులో గ్యాంగ్ రేప్
కదులుతున్న కారులో 16 సంవత్సరాల బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన
కదులుతున్న కారులో 16 సంవత్సరాల బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ఈ కేసులో ఇద్దరు నిందితులతో పాటు నేరం జరిగిన సమయంలో అక్కడ ఉన్న మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు తనకు పరిచయమున్న ఇద్దరు వ్యక్తులను కలిసేందుకు వెళ్లిన సమయంలో జూలై 6 రాత్రి పొద్దుపోయిన తర్వాత ఈ దారుణం చోటు చేసుకుంది. నిందితులపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి 23, 25 మరియు 35 ఏళ్ల వయసున్న ముగ్గురిని అరెస్టు చేశారు.
దక్షిణ ఢిల్లీలోని వసంత్ విహార్ నుండి ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ కు నిందితులు కారును తీసుకుని వెళ్లారు. సుమారు 44 కిలోమీటర్లు కారు వెళ్ళింది. ఈ ఘటనకు సంబంధించి బాలిక ఇంటి దగ్గరే ఉంటున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. జులై 6 సాయంత్రం మోతీ బాగ్ ప్రాంతంలో ఫ్రెండ్ను కలిసి తిరిగి ఇంటికి వస్తుండగా తనకు గతంలో పరిచయం ఉన్న ఇద్దరు వ్యక్తులు కలిశారని బాధితురాలు తెలిపింది. ఆపై వారు మరోవ్యక్తికి ఫోన్ చేయగా అతడు కారులో వచ్చాడని తనను మహిపల్పూర్ మార్కెట్కు తీసుకువెళ్లారని పేర్కొంది. మద్యం సేవించి తనతో బలవంతంగా తాగించారని ఆపై కదులుతున్న కారులో తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని తెలిపింది. తాను ప్రతిఘటించగా తీవ్రంగా కొట్టారని తెలిపింది. లైంగిక దాడి ఘటనను వారు వీడియో తీశారని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో వివరించింది. అత్యాచారం చేస్తున్న సమయంలో వీడియో కూడా రూపొందించినట్లు తెలిసింది. రెండు రోజుల తర్వాత బాలిక చికిత్స పొందుతున్న ఆసుపత్రిని సంప్రదించగా పోలీసులకు విషయం తెలిసింది.
Next Story