Mon Dec 23 2024 05:52:42 GMT+0000 (Coordinated Universal Time)
ఒక్క మిస్డ్ కాల్ తో రూ.50 లక్షలు కొట్టేశారు.. ఇదెక్కడి సైబర్ క్రైమ్ ?
అతడి ఫోన్కు మిస్డ్ కాల్స్ వచ్చాయి. సైబర్ మోసగాళ్లు అతనిని ఏ OTP అడగలేదు. బాధితుడి మల్టీ అకౌంట్లలో అనేక లావాదేవీలు..
సాధారణంగా మొబైల్ వాడే ప్రతిఒక్కరికీ స్పామ్ కాల్స్ రావడం సహజం. నెంబర్ రీఛార్జ్ అయిపోయిందని, బ్యాంక్ లోన్లు, క్రెడిట్ కార్డు తీసుకోమని.. ఇలా చాలా వస్తుంటాయి. ఒక్కోసారి బ్లాక్ లిస్ట్ లో పెట్టిన కాల్స్ ఒక రింగ్ తో ఆగిపోతాయి. కొన్ని స్పాం కంపెనీలు మిస్డ్ కాల్స్ ఇస్తుంటాయి. అలాంటి మిస్డ్ కాల్ తో కొత్తతరహా సైబర్ క్రైమ్ జరిగింది. ఒకటి రెండు కాదు.. అక్షరాలా రూ.50 లక్షలు కొట్టేశారు. కాల్ లిఫ్ట్ చేయలేదు. బ్యాంక్ డీటెల్స్ చెప్పలేదు, ఓటీపీ షేర్ చేయలేదు. కానీ డబ్బులు మాయమైపోయాయి.
అతడి ఫోన్కు మిస్డ్ కాల్స్ వచ్చాయి. సైబర్ మోసగాళ్లు అతనిని ఏ OTP అడగలేదు. బాధితుడి మల్టీ అకౌంట్లలో అనేక లావాదేవీలు చేసి లక్షల రూపాయలు కాజేశారు. బాధితుడికి కొన్ని రోజుల క్రితం రాత్రి 7 నుంచి 8.45 గంటల మధ్య.. మొదట కొన్నికాల్స్ పట్టించుకోలేదు. చివరికి ఒక కాల్ ను లిఫ్ట్ చేసి హలో అన్నాడు గానీ.. అవతలి వైపు నుండి ఎవరూ మాట్లాడలేదు. కొద్దిసేపటి తర్వాత బాధితుడి ఫోన్ కు వరుసగా మెసేజ్ లు వచ్చాయి. తన మొబైల్ ఫోన్ను చెక్ చేయగానే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (RTGS) మెసేజ్ రావడం చూసి షాక్ అయ్యాడు.
దాదాపు అరకోటి వరకు (రూ.50లక్షలు) రియల్ టైమ్ సెటిల్మెంట్ ద్వారా నగదు బదిలీ జరిగినట్టు గుర్తించాడు. వెంటనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదుపై పోలీసు కేసు నమోదైంది. కాగా.. ఇది సిమ్ స్వాప్ ఆధారంగా జరిగి ఉండవచ్చని సైబర్ బ్రాంచ్ భావిస్తోంది. ఏదేమైనా తెలియని నంబర్ల నుండి ఫోన్ కాల్స్ వస్తే లిఫ్ట్ చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Next Story