Mon Dec 23 2024 10:48:50 GMT+0000 (Coordinated Universal Time)
ప్రాపర్టీని జప్తు చేయాలని కోర్టు నుండి నోటీసులు.. అతడేమి చేశాడంటే ?
ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు కోర్టు నోటీసు పంపిన తర్వాత ఢిల్లీ వ్యక్తి తనకు తానుగా నిప్పంటించుకున్నాడని..
ఢిల్లీలోని గోకల్‌పురి ప్రాంతంలో శనివారం నాడు 33 ఏళ్ల వ్యక్తి నిప్పంటించుకున్నాడు. తన ఆస్తులను జప్తు చేయాలని కోర్టు నుండి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో నిప్పంటించుకుని కాలిన గాయాలతో మరణించాడని పోలీసులు తెలిపారు. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వంశిక కలెక్షన్స్ యజమాని కపిల్ కుమార్ (33) కు కోర్టు నుండి ఆస్తి జప్తు నోటీసు అందుకున్నాడు. దీంతో అతడు తనపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. శనివారం తెల్లవారుజామున 3.43 గంటలకు మరణించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.
ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు కోర్టు నోటీసు పంపిన తర్వాత ఢిల్లీ వ్యక్తి తనకు తానుగా నిప్పంటించుకున్నాడని.. విచారణ జరుపుతోందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. "కొందరు అధికారులు గోకల్ పూరి పోలీస్ స్టేషన్‌కు వచ్చి.. ఒక ఆస్తిని స్వాధీనం చేసుకునేందుకు పోలీసు సహాయం కోరుతూ కోర్టు ఉత్తర్వును సమర్పించారు. పోలీసు స్టేషన్ నుండి సిబ్బంది ఆస్తిని జప్తు చేయడానికి ఆ ప్రాంతానికి వెళ్లారు" అని పోలీసులు తెలిపారు.
అధికారులు ఆస్తిని జప్తు చేయడానికి వస్తున్నారని సమాచారం అందుకున్నాక, ఆ వ్యక్తి తన ఆస్తికి సమీపంలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడానికి ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. స్థానికులు అతనిని రక్షించి మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. వెంటనే పోలీసు సిబ్బంది అతడిని జీటీబీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనిపై గోకల్ పురి పోలీస్ స్టేషన్లో ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 306 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.
- Tags
- delhi
- crime news
Next Story