Mon Dec 23 2024 12:43:08 GMT+0000 (Coordinated Universal Time)
బాలికపై వృద్ధుడు అత్యాచారం.. ఆ అనుమానంతో వీడియో తీసిన కొడుకు
ఒక రోజు బాలికకు ఏదో విషయం చెప్పి.. తన ఇంటికి తీసుకెళ్లిన వృద్ధుడు.. ఓ మూలకు తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు.
16 ఏళ్ల బాలికపై 68 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ లో దేశరాజధాని ఢిల్లీలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో బయటికి రావడంతో కలకలం రేగింది. ఆ వీడియోను వృద్ధుడి కుమారుడే తీయడం గమనార్హం. వీడియో బయటపడటంతో బాధిత బాలిక తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక ఇంటి పక్కనే నిందితుడైన వృద్ధుడు ఉండేవాడు. తాత వయసున్న వ్యక్తి కావడంతో.. ఆ బాలిక ఇంటికి తరచూ వెళ్లినా పెద్దగా పట్టించుకునేవారు కాదు. పూజల్లో పాల్గొనడం, ఆధ్యాత్మిక యాత్రలకు కూడా వాళ్లతో కలిసి వెళ్లేవాడు.
ఒక రోజు బాలికకు ఏదో విషయం చెప్పి.. తన ఇంటికి తీసుకెళ్లిన వృద్ధుడు.. ఓ మూలకు తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని హెచ్చరించాడు. అయితే ఇదంతా ఆ వృద్ధుడి కొడుకు(40) వీడియో తీశాడు. అందుకు కారణం తండ్రి చేతబడులు చేస్తున్నాడేమో అని అతనికి కలిగిన అనుమానమే. అందుకే ఆ గదిలో ఒక ఫోన్ ను రికార్డింగ్ లో పెట్టి ఉంచాడు. ఆ ఫోన్ లో వృద్ధుడు బాలికపై చేసిన అఘాయిత్యం రికార్డయింది. ఆ వీడియోను వృద్ధుడి కొడుకు బాలిక తండ్రికి చూపగా.. అతను పోలీసులను ఆశ్రయించాడు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఆ తండ్రి-కొడుకులకు మధ్య మాటల్లేవంట. నిందితుడితో పాటు అతని కొడుకుని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వీడియో ఉన్న ఫోన్లను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.
Next Story