200 మందికి పైగా మహిళలకు అలాంటి వీడియోలను పంపిస్తున్న కామాంధుడు
అధికారులు 200 మంది మహిళలకు అసభ్యకరమైన చిత్రాలు, వీడియోలను పంపినందుకు
ఢిల్లీలోని నార్త్ డిస్ట్రిక్ట్ సైబర్ పోలీస్ స్టేషన్ అధికారులు 200 మంది మహిళలకు అసభ్యకరమైన చిత్రాలు, వీడియోలను పంపినందుకు ఒక ఫ్యాక్టరీ కార్మికుడిని అరెస్టు చేశారు. నిందితుడిని హర్యానాలోని బహదూర్‌గఢ్‌కు చెందిన మనోజ్‌కుమార్‌గా గుర్తించారు. అతను బహదూర్‌గఢ్‌లోని జ్యూస్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. సైబర్ పోలీస్ స్టేషన్లో ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గృహిణిగా ఉంటూ ఫేస్బుక్లో తన బ్యూటీ పేజీని నిర్వహిస్తున్న బాధితురాలు.. గుర్తు తెలియని వ్యక్తి తనను అనామక కాల్లు, వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా వేధిస్తున్నారని పోలీసులకు తెలిపారు. నిందితుడు తనకు అసభ్యకర చిత్రాలు, వీడియోలు కూడా పంపుతున్నాడని తెలిపింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ మొదలుపెట్టగా.. ఆ కామాంధుడి గుర్తింపును కనుగొనడానికి వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుండి సమాచారం కోరింది. అతడి కాల్ వివరాల రికార్డులను కూడా తనిఖీ చేసి విశ్లేషించారు.