Sat Dec 21 2024 08:11:40 GMT+0000 (Coordinated Universal Time)
మాజీ ప్రియురాలిని చంపేసి.. ఆరు ముక్కలుగా నరికేశాడు
ఆజంగఢ్ జిల్లాలోని పశ్చిమి గ్రామంలో గల వ్యవసాయ బావిలో నవంబర్ 15వ తేదీన అర్థనగ్న మృతదేహాన్ని స్థానికులు..
ఢిల్లీలో శ్రద్ధ హత్య కేసు విచారణలో ఉండగానే.. అలాంటి దారుణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తనను ప్రేమించి.. మరొకరిని పెళ్లాడిందన్న కోపంతో.. మాజీ ప్రియురాలిని చంపేసి.. ఆరుముక్కలుగా నరికేశాడో ఉన్మాద ప్రియుడు. అనంతరం వాటిని బావిలో పడేసి.. తలను మాత్రం చెరువులోకి విసిరేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. మృతురాలికి సంబంధించిన శరీర భాగాలు బయటపడటంతో ఈ దారుణం వెలుగుచూసింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి.. అతడి వద్దనుండి నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే.. ఈ హత్యకు తన కుటుంబ సభ్యులు కూడా సహకరించారని నిందితుడు పోలీసులకు తెలిపాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆజంగఢ్ జిల్లాలోని పశ్చిమి గ్రామంలో గల వ్యవసాయ బావిలో నవంబర్ 15వ తేదీన అర్థనగ్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతురాలికి సంబంధించిన శరీర భాగాలు బయటపడటం స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని వెలికితీసి.. ఆరాధన గా గుర్తించారు. అనంతరం పోస్టుమార్టమ్ కు పంపించారు. కానీ.. మృతదేహం తల లభ్యం కాలేదు. ప్రాథమిక విచారణలో ఆ హత్య చేసింది అదే గ్రామానికి చెందిన ప్రిన్స్ యాదవ్ అని తెలియడంతో.. అతడిని అరెస్ట్ చేసి.. విచారించారు. తలను ఓ చెరువులో పడేశానని చెప్పడంతో.. యాదవ్ ను ఆ గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడి నుండి యాదవ్ పారిపోయేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు.
ఈ క్రమంలో యాదవ్ కాలిగి బుల్లెట్ తగిలి గాయమైంది. ప్రేమించిన తనను కాదని మరో వ్యక్తిని పెళ్లాడిందన్న కోపంతోనే ఈ హత్య చేశానని నిందితుడు అంగీకరించాడు. తన తమ్ముడు సర్వేష్, కుటుంబ సభ్యుల సహకారంతో చెరుకు తోటలో మాజీ ప్రియురాలిని చంపి, శవాన్ని ఆరు ముక్కలు చేసినట్లు తెలిపాడు. పోలీసులు నిందితుడిని రిమాండ్ కు తరలించారు.
Next Story