Thu Dec 26 2024 08:51:45 GMT+0000 (Coordinated Universal Time)
కుల ధృవీకరణ పత్రాలు దొరకలేదు.. యువతి ఆత్మహత్య
ఆమె వయసు 17 సంవత్సరాలు. ఇటీవల ప్లస్-2 పరీక్షల్లో ఉత్తీర్ణురాలైంది. ఎస్సీల జాబితాలోని ‘పన్నియాండి’ అనే
కాలేజీలలో చేరాలంటే కుల ధృవీకరణ పత్రాలు చాలా ముఖ్యం. అయితే సమయానికి ఆ పత్రం దొరక్కపోవడంతో కాలేజీలో అడ్మిషన్ దొరకదనే బాధతో ఆత్మహత్య చేసుకుంది ఓ అమ్మాయి. తిరువణ్ణామలై జిల్లాకు చెందిన షెడ్యూలు కులానికి చెందిన విద్యార్థినికి జిల్లా అధికారులు కులధ్రువీకరణ పత్రం జారీ చేయకపోవడంతో కళాశాలలో ప్రవేశం పొందలేక ఆత్మహత్య చేసుకుంది.
ఎడపాళయానికి చెందిన మురుగన్ కుమార్తె రాజేశ్వరి ఈ నిర్ణయం తీసుకుంది. ఆమె వయసు 17 సంవత్సరాలు. ఇటీవల ప్లస్-2 పరీక్షల్లో ఉత్తీర్ణురాలైంది. ఎస్సీల జాబితాలోని ‘పన్నియాండి’ అనే ఉపకులానికి చెందిన ఆ బాలికకు కులధ్రువీకరణ పత్రం జారీ చేయలేమంటూ రెవెన్యూ కార్యాలయం అధికారులు చెప్పారు. ఇతర జిల్లాల్లోని ఎస్సీల జాబితాలో ఆ ఉపకులం ఉంది. కానీ తిరువణ్ణామలై జిల్లాలోని జాబితాలో ఆ ఉపకులం లేదని అధికారులు తెలిపారు. కులధ్రువీకరణ పత్రం లేకుండా చేర్చుకోలేమంటూ అన్ని కళాశాలల నిర్వాహకులు చెప్పటంతో తీవ్ర మనస్తాపానికి గురైన రాజేశ్వరి ఈనెల 17న ఇంట్లో ఎవరూ లేని సమయంలో విషం తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ బాలిక ఆసిపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమ్మాయి కుటుంబాన్ని ఆదుకుంటామని, ఇకపై ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని తమిళనాడు ప్రభుత్వం చెబుతోంది.
Next Story