Tue Nov 05 2024 11:04:07 GMT+0000 (Coordinated Universal Time)
Data Leak : 81 కోట్ల మంది డేటా లీక్.. సైబర్ దొంగల చేతుల్లో
భారతీయుల వివరాలు సైబర్ దొంగల చేతికి చిక్కినట్లు అందిన వార్త ఆందోళన కలిగిస్తుంది
సైబర్ క్రైమ్ లు ఎక్కువయ్యాయి. సులువుగా సంపాదించడం కోసం అనేక మంది ముఠాలుగా ఏర్పడి ప్రపంచ వ్యాప్తంగా సైబర్ క్రైమ్ కు పాల్పడుతున్నాయి. వీరిని పట్టుకోవడమూ కష్టమే. బ్యాంకులో ఉన్న నగదు మనకు తెలియకుండానే మాయమయిపోతుంది. ఈజీ మనీ సంపాదనకు అలవాటుపడిన ముఠాలు సైబర్ క్రైమ్ కు పాల్పడుతున్నాయి. పోలీసు శాఖ వీరిని పట్టుకోవడం కోసం ప్రత్యేకంగా సైబర్ టీంలు ఏర్పాటు చేసినప్పటికీ దొడ్డిదారిలో వచ్చి దోచుకుపోతున్నారు.
కరోనా సమయంలో...
తాజాగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వద్ద ఉన్న భారతీయుల వివరాలు సైబర్ దొంగల చేతికి చిక్కినట్లు అందుతున్న సమాచారం ఆందోళన కలగిస్తుంది. సుమారు 81.5 కోట్ల మంది పౌరుల బయోమెట్రిక్ వివరాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయంటూ డార్క్ వెబ్ సైట్ లో పేర్కొనడంతో ప్రభుత్వ వర్గాలే నివ్వెర పోయాయి. దీనిపై సీబీఐ దర్యాప్తు చేయనున్నట్లు తెలిసింది. కరోనా సమయంలో సేకరించి డేటా ఐసీఎంఆర్, ఎన్సీఐ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వద్ద ఉన్నాయి. మరి సైబర్ దొంగలకు డేటా ఎక్కడి నుంచి లీక్ అయిందన్నది తేలాల్సి ఉంది.
Next Story