Fri Nov 22 2024 08:40:25 GMT+0000 (Coordinated Universal Time)
తండ్రి స్థానంలో ఉంటాడనుకుంటే.. పాపానికి కేరాఫ్ గా నిలిచాడు
కానీ ఇక్కడ మనం మాట్లాడుకునే తండ్రికి ఎలాంటి శిక్ష విధించినా తప్పు లేదు. ఇద్దరు కూతుళ్లను ఓ తండ్రి గర్భవతులను చేశాడు
తండ్రి.. అంటే బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారని అంటుంటారు. కానీ ఇక్కడ మనం మాట్లాడుకునే తండ్రికి ఎలాంటి శిక్ష విధించినా తప్పు లేదు. ఇద్దరు కూతుళ్లను ఓ తండ్రి గర్భవతులను చేశాడు. ఇందుకు భార్య సైతం మద్దతు ఇచ్చిన దారుణ ఘటన ఏపీలోని ఏలూరు జిల్లా పెదపాడు మండలంలో చోటు చేసుకుంది. కుమార్తెల ఫిర్యాదుతో దిశ పోలీసులు తల్లిని, రెండో భర్తను అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ మహిళకు గతంలో పెళ్లి అయి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఆమె భర్త 2007లో అనారోగ్యంతో చనిపోయాడు.మేనత్త కుమారుడిని రెండో పెళ్లి చేసుకుంది. అప్పటికే సదరు మహిళకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అయింది. రెండో పెళ్లి అనంతరం భర్త తనకు పిల్లలు కావాలని ఒత్తిడి తేవడం ప్రారంభించాడు. లేదంటే మరో పెళ్లి చేసుకుంటానని బెదిరించాడు. దీంతో తల్లి తన ఇద్దరు కూతుళ్లు యుక్త వయసుకు వచ్చారని వారితోనే పిల్లలను కనాలని సూచించింది. 17 ఏళ్ల పెద్ద కుమార్తె 2017లో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. మగపిల్లాడి కోసం రెండో కుమార్తెను సైతం రెండో భర్తకు మహిళ అప్పగించింది. రెండో కుమార్తెకు మగ శిశువు పుట్టి చనిపోయాడు. ఈ విషయాన్ని అప్పట్లో ఎవరూ బయటపెట్టలేదు.
అయితే రెండో భర్తతో మహిళకు ఇటీవల విభేదాలు ఏర్పడ్డాయి. చిన్న కుమార్తె ఈ విషయాన్ని తనకు తెలిసిన ఓ యువకుడికి తెలిపింది. ఆ యువకుడు ఆడపిల్లల బంధువులకు విషయాన్ని చెప్పాడు. దీంతో ఇద్దరు ఆడపిల్లల బంధువులు ఏలూరు దిశ పీఎస్లో కంప్లైంట్ చేశారు. నిందితులపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ చంద్రకుమార్ తెలిపారు. నిందితులైన పుట్టా సతీష్, అతని భార్యను అదుపులో తీసుకున్నారు.
Next Story