Mon Dec 23 2024 19:18:05 GMT+0000 (Coordinated Universal Time)
డీఎంకే నేత దారుణ హత్య.. ఇంకా దొరకని తల
చెన్నైలోని ఓ మురికి కాల్వలో మనిషి శరీర భాగాలు కొట్టుకొచ్చినట్లు సమాచారం రావడంతో.. పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. వాటిని..
మనాలి : వివాహేతర సంబంధానికి డీఎంకే నేత బలయ్యారు. మనాలికి చెందిన డీఎంకే నేత ఎస్ చక్రపాణి దారుణ హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. వడ్డీవ్యాపారం చేసే చక్రపాణికి ఓ వివాహితతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆమె భర్త సూచన మేరకు ఓ రోజు చక్రపాణిని ఇంటికి ఆహ్వానించి, మరో స్నేహితుడి సహాయంతో అతడిని ముక్కలు ముక్కలుగా నరికి చంపారు. ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు తల, మొండేన్ని వేరు చేసి మురికి కాల్వలో పడేశారు.
చెన్నైలోని ఓ మురికి కాల్వలో మనిషి శరీర భాగాలు కొట్టుకొచ్చినట్లు సమాచారం రావడంతో.. పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. చనిపోయింది డీఎంకే నేత చక్రపాణిగా గుర్తించారు. కానీ.. ఇంతవరకూ అతని తల మాత్రం దొరకలేదు. చక్రపాణి తల కోసం పోలీసులు ఆ ప్రాంతంలో గాలిస్తున్నారు. ఇదిలా ఉండగా.. చక్రపాణిని చంపిన నిందితుల్లో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి విచారణ చేశారు. డబ్బే హత్యకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. తమ ఇంటికి సమీపంలో ఉండే సయారా భాను అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
సయారా కూడా తమ ఆర్థిక అవసరాల కోసం ఆ బంధాన్ని కొనసాగించింది. చక్రపాణి వద్ద అప్పుచేసిన సయారా..రాయపురానికి మకాం మార్చాక కూడా తమ బంధాన్ని కొనసాగించారు. ఏమైందో తెలీదు గానీ.. ఓ రోజు భర్త అతడిని చంపేందుకు ప్లాన్ వేశాడు. ప్లాన్ లో భాగంగా ఇంటికి రప్పించి, బంధువు సహాయం ముక్కలు ముక్కలుగా నరికి చంపినట్లు అంగీకరించారు.
Next Story