Mon Dec 23 2024 04:44:19 GMT+0000 (Coordinated Universal Time)
తుపాకీతో కాల్చుకుని వైద్యుడి మృతి
జూబ్లీహిల్స్ రోడ్ నెం.7లో ఉంటోన్న డాక్టర్ మజారుద్దీన్.. పాయింట్ బ్లాంక్ రేంజిలో తుపాకీతో కాల్చుకున్నారు.
హైదరాబాద్ లో ఓ వైద్యుడు తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. జూబ్లీహిల్స్ రోడ్ నెం.7లో ఉంటోన్న డాక్టర్ మజారుద్దీన్.. పాయింట్ బ్లాంక్ రేంజిలో తుపాకీతో కాల్చుకున్నారు. తీవ్రంగా గాయపడిన అతడిని కుటుంబ సభ్యులు హుటాహుటిన అపోలో ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు.
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, మజారుద్దీన్ ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేస్తున్నారు. ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబంలో గొడవల వల్లే ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. డాక్టర్ మజారుద్దీన్ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కు వియ్యంకుడు అని తెలుస్తోంది.
Next Story