Mon Dec 23 2024 02:35:44 GMT+0000 (Coordinated Universal Time)
దొరికిపోయాక డాక్టర్ రాధ భర్త ఏమడిగాడో తెలుసా?
భార్యను చంపిన తర్వాత కూడా ఏమీ ఎరగనట్టు తన ఆసుపత్రిలో రోగులను చూస్తూ కూర్చున్నాడు.
కృష్ణా జిల్లా మచిలీపట్టణంలో సంచలనం సృష్టించిన డాక్టర్ రాధ హత్య కేసు మిస్టరీ వీడింది. భర్తే ఆమెను కడతేర్చాడు. ఆమె భర్త డాక్టర్ లోక్నాథ మహేశ్వరరావు పోలీసుల విచారణలో సంచలన విషయాలను బయటపెట్టాడు. ముఖ్యంగా తాను దొరికిపోతానని అతడు అసలు ఊహించలేదని చెప్పాడట..! చాలా పకడ్బందీగా, ఎలాంటి అనుమానాలు రాకుండా హత్య చేశానని, మీరెలా కనుక్కోగలిగారంటూ ఆయన వేసిన ప్రశ్నతో పోలీసులే షాక్ అయ్యారు.
భార్యను చంపిన తర్వాత కూడా ఏమీ ఎరగనట్టు తన ఆసుపత్రిలో రోగులను చూస్తూ కూర్చున్నాడు. ఈ కేసులో మహేశ్వరరావు, డ్రైవర్ మధును శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు వీరికి 14 రోజుల రిమాండ్ విధించింది. హత్య జరిగిన రోజున పోలీసులకు ఎలాంటి సాక్ష్యాలు లభించలేదు. ఎవరిపైనా అనుమానం రాలేదు. భారీ వర్షం కురుస్తుండడంతో దొంగతనానికి వచ్చే అవకాశం లేదని పోలీసులు భావించారు. ఒకవేళ దొంగతనానికి వచ్చినా ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను వదిలిపెట్టరు. ఇంట్లో 8 కిలోల బంగారం, రూ. 50 లక్షల నగదు ఉంది. దొంగతనం చేసిన వారు వాటిని ముట్టుకోకుండా కేవలం ఆమె ఒంటిపైన ఉన్న నగలను మాత్రమే తీసుకెళ్లడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. సాంకేతిక ఆధారాలు కూడా నిందితులను పట్టించాయి. టవర్ డంప్ విశ్లేషణలో 12 ఫోన్ నంబర్లు అనుమానాస్పదంగా కనిపించాయి. ఒక నంబరు డాక్టర్ మహేశ్వరరావుది కాగా.. ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు డ్రైవర్ మధుకు ఆ నంబరు నుంచి పదేపదే ఫోన్ కాల్స్ వెళ్లాయి. ఇవన్నీ పోలీసులకు మరింత అనుమానాన్ని పెంచాయి. జులై 26న రాధ తన కోడలు ప్రసవం కోసం పిడుగురాళ్ల వెళ్లాల్సి ఉంది. ఆమె వెళ్తే ఇప్పట్లో రాదని భావించి.. నిందితుడు 25నే హత్యకు ప్లాన్ చేశాడు. హత్య జరిగిన రోజున నిందితులు మహేశ్వరరావు, డ్రైవర్ మధు సాయంత్రం 5.45 గంటలకు ఇంటి లోపలికి వెళ్తున్న దృశ్యాలు ఆసుపత్రి పక్కనున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. హత్య అనంతరం లిఫ్ట్ ద్వారా డాక్టర్, మెట్ల మార్గంలో మధు కిందికి రావడం కూడా రికార్డయింది. భారీ వర్షంలో డాక్టర్ స్కూటీపై సూపర్ మార్కెట్కు వెళ్లి కారం ప్యాకెట్ కొనుగోలు చేయడం కూడా సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఇది కూడా ఓ సాక్ష్యంగా మారింది. ఎంతో ప్లాన్ చేసినా కూడా దొరికిపోయానని లోక్నాథ మహేశ్వరరావు బాధ తప్పితే.. భార్యను అంతం చేశానని ఏ మాత్రం ఫీల్ అవ్వడం లేదని అతని వైఖరిని బట్టి తెలుస్తోంది.
Next Story