Mon Dec 23 2024 14:38:41 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ ఖుషి హీరోయిన్ పై ఆ కేసు.. పోలీసులకు ఫోన్ కాల్ రావడంతో
ఎంతో మంది సినిమా ప్రముఖులను వెంటాడిన చైల్డ్ లేబర్ కేసు.. నటి ముంతాజ్ ను కూడా వెంటాడుతోంది. ఖుషీ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసిన ముంతాజ్.. ఆ తర్వాత తెలుగు-తమిళంలో పలు సినిమాల్లో చేశారు. ఇప్పుడు ఆమెపై గృహహింస కేసు నమోదైంది.

అప్పట్లో ఖుషీ సినిమాలో నటించిన ముంతాజ్.. 'అత్తారింటికి దారేది' సినిమాలో కూడా కనిపించింది. ముంతాజ్‌పై ఇప్పుడు గృహ హింస కేసు నమోదవ్వడంతో ఆమెను అరెస్ట్ చేస్తారని తమిళనాడు మీడియా కథనాలను ప్రసారం చేస్తోంది.
ముంతాజ్ గత కొద్దికాలంగా చెన్నైలో ఉంటోంది. ఆమె ఇంట్లో ఉత్తరాదికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలు ఇంటి పని చేస్తున్నారు. ముంతాజ్ తమను వేధిస్తోందని, ఇంటికి పంపించడం లేదంటూ చెన్నై అన్నానగర్ పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసింది ఓ బాలిక. ప్రతిరోజూ ముంతాజ్ చిత్రహింసలు పెడుతోందని ఆ బాలిక ఆరోపించింది. పోలీసులు ముంతాజ్ ఇంటికెళ్లి ఆ బాలికను బాలల సంరక్షయణ కేంద్రానికి తరలించారు. ఆపై ముంతాజ్‌పై కేసు నమోదు చేశారు. మైనర్ బాలిక వ్యవహారం కావడంతో ముంతాజ్‌ను అరెస్టు చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. గతంలో చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులపై చైల్డ్ లేబర్ కేసులు నమోదయ్యాయి.
టి.రాజేంధర్ దర్శకత్వం వహించిన 'మోనిషా ఎన్ మోనాలిసా' సినిమాతో తమిళ చిత్రసీమకు పరిచయమైన నటి ముంతాజ్ ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. కొంత విరామం తర్వాత కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్న 'బిగ్ బాస్ 2'లో పాల్గొనడం ద్వారా ఆమె మళ్లీ వెలుగులోకి వచ్చింది. నటి తన కుటుంబ సభ్యులతో కలిసి చెన్నైలోని అన్నానగర్‌లోని హెచ్‌బ్లాక్ ప్రాంతంలో నివసిస్తోంది. మైనర్ బాలికలు గత ఆరేళ్లుగా నటి ఇంట్లో పనిచేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందించారు. వారిని స్వగ్రామాలకు కూడా పంపేందుకు యజమానులు తమను అనుమతించడం లేదని మైనర్లు ఆరోపించారు.

Next Story