Sat Dec 21 2024 04:50:16 GMT+0000 (Coordinated Universal Time)
ఇద్దరి ప్రాణాలు తీసిన ఇన్ స్టా గ్రామ్
ముకుంద్పూర్ పార్ట్ 2లో ఓ అమ్మాయి తనను కలవాలని బాధిత వ్యక్తులను కోరింది. అమ్మాయి పిలిచిందని అక్కడికి వెళ్లిన ఇద్దరిపై..
ఇటీవల యువతకు సోషల్ మీడియా ఒక వ్యసనమైంది. మంచి కన్నా చెడే ఎక్కువ వ్యాపిస్తోంది. సోషల్ మీడియా ద్వారా చాలా వరకూ హనీట్రాప్ జరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఈ కేసులు బయటపడ్డాయి కూడా. తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో లైక్ లు కామెంట్లపై జరిగిన వాదన ఇద్దరు వ్యక్తుల ప్రాణాలు తీసింది. బుధవారం ఢిల్లీలో జరిగిన ఈ జంట హత్యల కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోషల్మీడియాలో అమ్మాయితో వివాదం కారణంగా ఢిల్లీలోని ఔటర్లోని భల్స్వా డెయిరీలో ఇద్దరు వ్యక్తులను కత్తితో పొడిచి చంపేశారని పోలీసులు తెలిపారు. మృతులు నిఖిల్ (26), సాహిల్ (19) లుగా గుర్తించారు.
ముకుంద్పూర్ పార్ట్ 2లో ఓ అమ్మాయి తనను కలవాలని బాధిత వ్యక్తులను కోరింది. అమ్మాయి పిలిచిందని అక్కడికి వెళ్లిన ఇద్దరిపై దాడి చేసి, కత్తితో పొడిచారు. తీవ్రమైన కత్తిపోట్లతో రక్తపు మడుగులో పడి ఉన్న ఇద్దరినీ చూసిన స్థానికులు.. వెంటనే ఆస్పత్రికి తరలించగా ఇద్దరూ మృతి చెందినట్లు తెలిపారు. ఈ కేసులో యువతి, ఆమె మైనర్ సోదరుడు సహా నలుగురు నిందితుల్నీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్టాగ్రామ్లో చేసిన వ్యాఖ్యపై ఓ అమ్మాయికి, నిఖిల్ అనే యువకుడికి మధ్య గొడవ జరిగింది. దాంతో ఆమె.. వీధిలోకి వచ్చి మీ ధైర్యమేంటో చూపించండి అంటూ సవాల్ చేసింది.
Next Story