Mon Dec 23 2024 17:59:26 GMT+0000 (Coordinated Universal Time)
గుజరాత్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత
నిన్న నార్కోటిక్స్ అధికారులు 256 కిలోల హెరాయిన్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.1300 కోట్లకు..
అహ్మదాబాద్ : భారత్ మత్తులో ఊగుతోందనడంలో ఆశ్చర్యం లేదు. దేశంలో రోజురోజుకూ డ్రగ్స్ దందా పెరిగిపోతోంది. విద్యార్థులు, సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, ఐటీ ఉద్యోగులే టార్గెట్ గా డ్రగ్స్ అక్రమ రవాణా భారీ ఎత్తున జరుగుతోంది. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై వంటి మెట్రో సిటీల్లో డ్రగ్స్ దందా జోరుగా సాగుతోంది. తాజాగా గుజరాత్ లో భారీమొత్తంలో మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి.
నిన్న నార్కోటిక్స్ అధికారులు 256 కిలోల హెరాయిన్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.1300 కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు చెప్తున్నారు. గుజరాత్‌లోని కండ్లా పోర్టుకు సమీపంలోని కంటైనర్ నిలిపివుంచే ప్రాంతంలో ఈ డ్రగ్స్ ని పట్టుకున్నారు అధికారులు. కచ్ జిల్లాలోని కండ్లా పోర్టుకు సమీపంలో ఉన్న కంటెయినర్ స్టేషన్లో డ్రగ్స్ ఉన్నాయంటూ గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్)కు విశ్వసనీయవర్గాల నుంచి సమాచారం అందింది.
దీంతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) కలిసి రంగంలోకి దిగిన ఏటీఎస్ అధికారులు కండ్లా పోర్ట్‌లోని కంటెయినర్ స్టేషన్లో తనిఖీలు చేపట్టారు. అధికారులు తనిఖీలు చేస్తున్న సమయంలోనే కంటెయినర్ లోపల భారీగా హెరాయిన్ దాచి తరలిస్తుండగా పట్టుకున్నారు. కంటైనర్ తెరిచి చూడగా అందులో 260 కిలోల హెరాయిన్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీని విలువ రూ.1300 కోట్లుగా ఉంటుందని డీఆర్ఐ అధికారులు వెల్లడించారు.
Next Story