Tue Dec 24 2024 02:22:03 GMT+0000 (Coordinated Universal Time)
డ్రైవర్ కు గుండెపోటు.. పొదల్లోకి దూసుకెళ్లిన బస్సు
ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో యాత్రికులను తీసుకుని వెళ్తున్న డ్రైవర్ కు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది.
డ్రైవర్ కు గుండెపోటు రావడంతో.. బస్సు పొదల్లోకి దూసుకెళ్లిన విషాదకరమైన ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో యాత్రికులను తీసుకుని వెళ్తున్న డ్రైవర్ కు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. డ్రైవింగ్ పై పట్టు కోల్పోవడంతో బస్సు పొదల్లోకి దూసుకెళ్లింది. అప్పటికే డ్రైవర్ మరణించాడు. ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం వీరభద్రపురం గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సు ప్రమాద సమయంలో 45 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు. అదృష్టం కొద్దీ ప్రాణనష్టం జరగలేదు. కొందరికి స్వల్ప గాయాలు కాగా.. వారిని వెంకటాపురం ఆసుపత్రికి తరలించారు. వీరంతా కాణిపాకం నుండి యాదాద్రికి వెళ్తున్నట్లు తెలిసింది. ప్రయాణికులంతా చిత్తూరు జిల్లాకు చెందినవారుగా గుర్తించారు.
Next Story