Mon Dec 23 2024 15:33:57 GMT+0000 (Coordinated Universal Time)
కదులుతున్న బస్సులో మహిళపై డ్రైవర్ అత్యాచారం
అర్థరాత్రి 12.30 గంటలు దాటుతుండగా.. బస్సు సూర్యాపేట దాటింది. బస్సును మరో డ్రైవర్ నడుపుతుండగా.. రాజేశ్ (35) అనే ఇంకో డ్రైవర్..
సూర్యాపేట : కదులుతున్న బస్సులో డ్రైవర్ మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటన తెలంగాణలోని సూర్యాపేట సమీపంలో జరిగింది. హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్తున్న ప్రైవేటు బస్సులో ఒంటరిగా ఉన్న మహిళపై డ్రైవర్ అత్యాచారం చేయగా.. కూకట్ పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మహిళ (29) హైదరాబాద్ లో బేబీ కేర్ టేకర్ గా పనిచేస్తూ.. తన ఇద్దరు పిల్లలతో కలిసి మాదాపూర్ లో నివాసం ఉంటుంది. భర్త వేరుగా ఉంటున్నాడు. సొంతూరికి వెళ్లేందుకు మహిళ ఈనెల 23న కూకట్ పల్లిలో ప్రైవేటు స్లీపర్ బస్సు ఎక్కారు. బస్సులో తనకు చివరి సీటును కేటాయించగా.. ఆ సీట్లోనే కూర్చుని నిద్రపోయింది.
అర్థరాత్రి 12.30 గంటలు దాటుతుండగా.. బస్సు సూర్యాపేట దాటింది. బస్సును మరో డ్రైవర్ నడుపుతుండగా.. రాజేశ్ (35) అనే ఇంకో డ్రైవర్ ఆమె వద్దకు వచ్చి కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఉదయం ఆమె దిగాల్సిన ఊరు వచ్చింది. బస్సు దిగుతుండగా.. మరోమారు ఆమెను బెదిరించి రూ.7 వేల నగదును రాజేశ్ లాక్కున్నాడు. ఫిబ్రవరి 26న తిరిగి హైదరాబాద్ చేరుకున్న బాధిత మహిళ.. జరిగిన ఘటనపై కూకట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Next Story