Wed Dec 25 2024 16:42:23 GMT+0000 (Coordinated Universal Time)
Drugs : చైతన్యపురిలో డ్రగ్స్ కలకలం
చైతన్యపురిలో డ్రగ్స్ కలకలం రేగింది. డ్రగ్స్ ను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
చైతన్యపురిలో డ్రగ్స్ కలకలం రేగింది. డ్రగ్స్ ను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్స్ ను తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భీమవరానికి చెందిన కూనపరాజు, లక్ష్మీనరసింహరాజులతో పాటు జీడిమెట్లకు చెందిన జులిమ్ శ్యామ్ రబాయ్ లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నూతన సంవత్సర వేడుకల కోసం...
కొత్త ఏడాదికి ఈ డ్రగ్స్ ను తెస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. డిసెంబరు 31వ తేదీ రాత్రి కోసం హైదరాబాద్ లో ఎక్కువగా డ్రగ్స్ విక్రయం తో పాటు తీసుకోవడం కూడా జరుగుతుందని భావించిన పోలీసులు నిఘాను తీవ్రతరం చేశారు. అయితే చైతన్యపురి ఘటనలో గోవాకు చెందిన డ్రగ్ ప్లెడర్ హబీబ్ మాత్రం పోలీసుల కన్నుగప్పి పరారయ్యారు.
Next Story