Wed Nov 13 2024 22:18:50 GMT+0000 (Coordinated Universal Time)
కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
పండ్ల మాటున సరఫరా చేస్తున్న డ్రగ్స్ ను డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు నవీ ముంబయిలో పట్టుకున్నారు
పండ్ల మాటున సరఫరా చేస్తున్న డ్రగ్స్ ను డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు నవీ ముంబయిలో పట్టుకున్నారు. 198 కిలోల క్రిస్టల్ మెథాంఫేటమిస్, తొమ్మిది కిలోల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 1,476 కోట్ల రూపాయలు అని డీఆర్ఐ అధికారులు గుర్తించారు. దేశంలో ఇప్పటి వరకూ స్వాధీనం చేసుకున్న యాంఫెటమైన్, కొకైన్ లలో ఇదే అధిక మొత్తం అని అధికారులు తెలిపారు.
ఆరెంజ్ పండ్ల మాటున...
పక్కా సమాచారం అందడంతో పండ్ల ట్రక్కులో ఈ డ్రగ్స్ ను కనుగొన్నారు. ఆరెంజ్ పండ్ల బాక్సులలో ఈ డ్రగ్స్ ఉంచి భారత్ లోకి తీసుకువచ్చారు. డ్రగ్స్ ను సరఫరా చేసేందుకు కొత్త మార్గాలను ఎంచుకున్నారు. ఈ డ్రగ్స్ దక్షిణాఫ్రికా నుంచి వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ సందర్బంగా కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. డగ్ర్స్ ను సప్లయ్ చేసిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
- Tags
- drugs
- navi mumbai
Next Story