Thu Dec 26 2024 04:17:19 GMT+0000 (Coordinated Universal Time)
132 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
హర్యానా లో డ్రగ్స్ ను భారీ స్థాయిలో పట్టుకున్నారు. 133 కోట్ల విలువ చేసే 661 కేజీల ఎఫిడ్రిన్ ను స్వాధీనం చేసుకున్నారు
హర్యానా లో డ్రగ్స్ ను భారీ స్థాయిలో పట్టుకున్నారు. దాదాపు 133 కోట్ల విలువ చేసే 661 కేజీల ఎఫిడ్రిన్ ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు 5,200 కేజీల ముడి సరుకును కూడా డీఆర్ఐ అధికారులు సీజ్ చేశారు. యమునానగర్ లోని క్లాండిస్టిన్ ఫ్యాక్టరీలో డీఆర్ఐ బృందం సోదాలు నిర్వహించింది. అక్రమంగా నిల్వ ఉంచిన డ్రగ్స్ ను గుర్తించిన అధికారులు విస్తుపోయారు.
ఆఫ్రికా నుంచి వచ్చిన.....
తొలుత ఆఫ్రికా నుంచి బెంగళూరుకు చేరుకునన ఒక ప్రయాణికుడి వద్ద నుంచి నుంచి 16 కేజీల హెరాయిన్ ను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ 112 కోట్ల రూపాయల విలువ ఉంటుందని అంచనా. ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారించగా హర్యానాలో జరుగుతున్న డ్రగ్స్ దందంా బయటపడింది. అతడిచ్చిన సమాచారం మేరకు హర్యానాలోని యమునానగర్ లో పరిశ్రమ లో దాడులు చేసి అక్కడ నిల్వ ఉంచిన ఎఫిడ్రిన్ డ్రగ్ ను పెద్దమొత్తంలో గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎఫిడ్రిన్ డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు గమనించిన అధికారులు పరిశ్రమను సీజ్ చేశారు. ప్రయాణికుడితో పాటు పరిశ్రమ యజమానిని అరెస్ట్ చేశారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
Next Story