Tue Nov 05 2024 16:20:06 GMT+0000 (Coordinated Universal Time)
వీకెండ్ లో అటు వెళితే ఉసురు తీస్తారు.. జాగ్రత్త
మద్యం తాగి వాహనాలు నడుపుతూ హైదరాబాద్ లో అనేక మంది ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నారు.
మద్యం తాగి వాహనాలు నడుపుతూ హైదరాబాద్ లో అనేక మంది ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నారు. ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా ప్రయోజనం లేదు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది ఇప్పటి వరకూ 242 మంది తాగి నడిపి వాహనాలు ఢీకొట్టడంతో మరణించారు. అదే గత ఏడాది 189 మంది మృతి చెందారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకూ 232 మంది మద్యంతో వాహనాలు నడిపిన కారణంగానే బలయిపోయారు. ఇప్టటి వరకూ డ్రంక్ అండ్ డ్రైవ్ కింద 32,828 కేసులు నమోదయ్యాయి.
ఆ ప్రాంతాల్లోనే....
దేశ వ్యాప్తంగా డ్రంక్ డ్రైవ్ కేసులు నమోదు చేయడంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. ఎక్కువగా పోష్ ఏరియాల్లోనే ఈ ప్రమాదాలు జరిగినట్లు గుర్తించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్, అవుటర్ రింగ్ రోడ్ పైనే తాగి వాహనాలు నడుపుతూ ప్రాణాలు తీస్తున్నారు. ముఖ్యంగా శని, ఆదివారాల్లో ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. పోలీసులు తాగి వాహనం నడిపిన వారిపైనే కాకుండా పబ్ లపైన కూడా కేసులు నమోదు చేస్తున్నారు. ఈ రకంగా 12 పబ్ లపై కేసులు నమోదు చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది.
Next Story