Wed Dec 25 2024 16:10:35 GMT+0000 (Coordinated Universal Time)
మందుబాబు ప్రాణం తీసిన ఆమ్లెట్
జనగామ జిల్లా బచ్చన్నపేటలో జరిగిందీ ఘటన. బచ్చన్నపేట గ్రామానికి చెందిన ఈదులకంటి భూపాల్ రెడ్డి (38) ..
ఆమ్లెట్.. ఓ మందుబాబు పాలిట యమపాశమైంది. మందుతాగేందుకు ఓ వైన్ షాపుకు వెళ్లి.. తనకు కావాల్సిన సీసా కొనుక్కున్నాడు. పక్కనే ఉన్నపర్మిట్ రూమ్ లోకి వెళ్లి.. ఖాళీగా ఉన్న టేబుల్ చూసుకుని కూర్చున్నాడు. మందులోకి మంచింగ్ లేకపోతే ఎలా అనుకున్నాడు. ఆమ్లెట్ ఆర్డర్ ఇచ్చి.. పెగ్ కలిపాడు. ఇంతలో ఆమ్లెట్ రానేవచ్చింది. కలిపిన పెగ్ తాగేసి.. వేడివేడిగా వచ్చిన ఆమ్లెట్ ను నోట్లో వేసుకున్నాడు. అంతే.. అది గొంతులో ఇరుక్కుని ఊపిరాడకుండా చేసింది.
జనగామ జిల్లా బచ్చన్నపేటలో జరిగిందీ ఘటన. బచ్చన్నపేట గ్రామానికి చెందిన ఈదులకంటి భూపాల్ రెడ్డి (38) మందులో ఆమ్లెట్ ను స్టఫ్ గా తీసుకుని ప్రాణాలు కోల్పోయాడు. ఆమ్లెట్ గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరి పీల్చుకోడానికి ఇబ్బంది పడ్డాడు. అతడిని ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణం పోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు తరలించి.. కేసు నమోదు చేసుకున్నారు.
Next Story