Mon Dec 23 2024 13:31:19 GMT+0000 (Coordinated Universal Time)
Drugs : బర్త్‌డే పార్టీ కోసం గోవా నుంచి డ్రగ్స్ తీసుకు వచ్చి.. పోలీసులకు చిక్కి
హైదరాబాద్ నగరంలో నార్కోటిక్ బ్యూరో అధికారులు జరిపిన తనిఖీల్లో భారీగా డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ నగరంలో నార్కోటిక్ బ్యూరో అధికారులు జరిపిన తనిఖీల్లో భారీగా డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఎస్సార్‌నగర్‌లోని సర్వీస్ అపార్ట్మెంట్లో నార్కోటిక్ బ్యూరో అధికారులు డ్రగ్స్‌ని స్వాధీన పరుచుకున్నారు. బర్త్ డే పార్టీ కోసం గోవా నుంచి యువకులు ఈ డ్రగ్స్ తీసుకువచ్చినట్లు పోలీసులకు సమాచారం అందడంతో దాడి చేసి పట్టుకున్నారు.
నెల్లూరు జిల్లాకు చెందిన...
పోలీసులకు పట్టుబడిన నిందితులది నెల్లూరు జిల్లా అని నార్కోటిక్ బ్యూరో తెలిపింది. పన్నెండు మంది ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగులను అరెస్ట్ చేసినట్లు నార్కోటిక్ బ్యూరో చెప్పింది. ప్రేమ్ చంద్ బర్త్ డే కోసం గోవా నుంచి సంపత్ డ్రగ్స్ తెప్పించాడని విచారణలో తేలింది. 30 మంది కోసం డ్రగ్స్ పార్టీని ప్రేమ్ చంద్ ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్లు అందరూ కలిపి ఈ పార్టీ చేసుకున్నట్లు సమాచారం.
Next Story