Wed Apr 02 2025 00:53:24 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఎనిమిది మంది సజీవ దహనం..ఏపీలో ఘటన
ఉమ్మడి అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సత్యసాయి జిల్లాలో విద్యుత్తు షాక్ తో ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు.

ఉమ్మడి అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రస్తుత సత్యసాయి జిల్లాలో విద్యుత్తు షాక్ తో ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు. తాడిమర్రి మండలంలోని చిల్లకొండయ్యపల్లిలో ఈ ఘటన జరిగింది. ఆటోపై హైటెన్షన్ విద్యుత్తు తీగ తెగి పడటంతో ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు. ఆటో పూర్తిగా దగ్దమయింది. ఆటో పైన ఇనుప సామాను ఉండటంతో ఈ ఘటన సంభవించింది.
గుడ్డంపల్లి వాసులుగా...
మృతి చెందిన ఎనిమిది మంది సత్యసత్యసాయి జిల్లాలోని గుడ్డంపల్లి వాసులుగా గుర్తించారు. వీరంతా కూలీ పనుల నిమిత్తం ఆటోలో బయలుదేరినట్లు సమాచారం. దీంతో గుడ్డంపల్లిలో విషాదం అలుముకుంది. పోలీసులు ఘటన స్థలికి చేరుకుని సహాయ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ఘటనపై విద్యుత్తు శాఖ అధికారులు, పోలీసులు విచారణ ప్రారంభించారు.
Next Story