Mon Dec 23 2024 16:11:42 GMT+0000 (Coordinated Universal Time)
మూగ మహిళ, కుమార్తెపై 8 మంది అత్యాచారం, ప్రైవేటు భాగాలపై కారం చల్లి..
ఈ ఘటనలో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న మరో నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు.
మహిళలు, ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న నిందితులను ఎంత కఠినంగా శిక్షించినా.. వారిపై జరిగే దారుణాలు ఆగడం లేదు. మూగ మహిళ, ఆమె కుమార్తెపై 8 మంది కామాంధులు అత్యాచారానికి ఒడిగట్టిన దారుణ ఘటన అస్సాంలోని గువాహటిలో వెలుగుచూసింది. సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా.. వారి ప్రైవేటు భాగాలపై కారంచల్లి పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. ఈ హృదయవిదారక ఘటన ఈ ఏడాది మే నెలలో జరుగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనలో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న మరో నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు. మే 17వ తేదీ రాత్రి సత్ గావ్ కు చెందిన అమిత్ ప్రధాన్, అతని సహచరులు బాధితురాలి ఇంటిలోకి ప్రవేశించి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. సామూహిక అత్యాచారం అనంతరం వారి ప్రైవేటు భాగాలపై నిందితులు కారం చల్లి పైశాచిక ఆనందం పొందినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. వారు అప్మారక స్థితిలోకి వెళ్లిపోగా.. ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. ఆరోగ్యం విషమించడంతో తల్లి కూతురిని గువాహటి వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు చికిత్స అందించారు.
Next Story