Mon Dec 23 2024 10:06:09 GMT+0000 (Coordinated Universal Time)
ఏలూరు యాసిడ్ దాడి బాధితురాలు మృతి
ఏలూరులోని జెవియర్ నగర్లో ఉంట్లోన్న ఎడ్ల ప్రాన్సిక.. దుగ్గిరాల సమీపంలోని దంతవైద్యశాలలో రిసెప్షనిస్టుగా పనిచేస్తోంది. భర్త
ఏలూరులో గతవారం యాసిడ్ దాడికి గురైన బాధితురాలు ప్రాన్సిక (35) విజయవాడలోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. జూన్ 13 మంగళవారం ఆమెపై యాసిడ్ దాడి జరిగింది. తీవ్రగాయాలపాలైన ప్రాన్సికను తొలుత ఏలూరు సర్వజన ఆసుపత్రికి, ఆ తర్వాత విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం మణిపాల్ ఆసుపత్రిలో చేర్చగా.. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించింది.
ఏలూరులోని జెవియర్ నగర్లో ఉంట్లోన్న ఎడ్ల ప్రాన్సిక.. దుగ్గిరాల సమీపంలోని దంతవైద్యశాలలో రిసెప్షనిస్టుగా పనిచేస్తోంది. భర్త రాజమండ్రిలో కెమికల్ ఇంజినీర్. ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. విభేదాలు రావడంతో ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. రాజమండ్రిలో తల్లిదండ్రుల వద్ద భర్త, ఏలూరులో తల్లిదండ్రుల వద్ద ప్రాన్సిక ఉంటున్నారు. వీరికి ఓ పాప కూడా ఉంది. గత మంగళవారం రాత్రి విధులు ముగించుకుని స్కూటీపై ఇంటికి వెళ్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తులు ప్రాన్సికపై యాసిడ్ దాడి చేశారు.
తల, ముఖంపై యాసిడ్ పడటంతో.. బిగ్గరగా కేకలు పెడుతూ సమీపంలోని ఇంటికి పరుగెత్తింది. ఆమె చెల్లెలు నీటితో కడిగి.. దుస్తులు మార్చి ఆసుపత్రికి తీసుకెళ్లింది. తొలుత ఏలూరు సర్వజన ఆసుపత్రికి, ఆ తర్వాత విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం మణిపాల్ ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ.. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మరణించింది.
Next Story